అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు.
ఇది కూడా చదవండి: Minister Ramprasad Reddy: గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి..
కెనడాపై అమెరికా అధిక స్థాయిలో సుంకాలను విధించింది. అంతేకాకుండా కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేస్తానంటూ ట్రంప్ ప్రకటించడంతో మార్క్ కార్నీ.. ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఏప్రిల్ 28న కెనడాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. బలమైన ప్రభుత్వంతో అమెరికాను ఎదుర్కొంటామని ఇటీవల మార్క్ కార్నీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Robinhood : రాబిన్ హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్ టాక్
మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. సాధారణంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మార్క్ కార్నీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ట్రంప్-కార్నీ మాట్లాడుకోలేదు. అయితే ఇటీవల వైట్‌హౌస్ నుంచి కాల్ షెడ్యూల్ వచ్చిందని.. ట్రంప్‌తో మాట్లాడబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఆర్థిక సమస్యలతో 14 రోజుల పసికందుని చంపేసిన తల్లి..