అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. అంతేకాకుండా అమెరికాయేతర పౌరులు విరాళం ఇవ్వకుండా నిషేధం విధించింది.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడి కోసం పిల్లల్ని వదిలేసిన మహిళ.. తన భార్యను లవర్‌కి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..
ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ఇతర దేశాలను ట్రంప్ ఉదాహరణగా చూపించారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయని.. యునైటెడ్ స్టేట్స్ మాత్రం ఎక్కువగా పౌరసత్వం కోసం స్వీయ-ధృవీకరణపై ఆధారపడుతుందని అన్నారు. ఆధునిక, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించే ప్రాథమిక మరియు అవసరమైన ఎన్నికల రక్షణలను అమలు చేయడంలో అమెరికా విఫలమైందని ట్రంప్ పేర్కొన్నారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయని.. మన ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయని ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bollywood : OTT లోకి ‘ఛోరీ 2’.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న టీజర్
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఓటర్లు తప్పనిసరిగా అమెరికా పౌరసత్వాన్ని గుర్తింపుగా చూపించాల్సి ఉంటుంది. యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని రుజువుగా చూపించాలి. అలాగే ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చాలామంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మొయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు. ఇక అలాంటి పద్ధతి ఉండదు.
ఇది కూడా చదవండి: SBI ATM Robbery: రావిర్యాలలో జరిగిన ఏటీఎం చోరీ కేసును చేధించిన పోలీసులు..