మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, పైజామాను కిందకి లాగడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడాని ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. ఈ తీర్పు పూర్తి అసమర్థత కూడినదంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది తీవ్రమైన విషయమని.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి వైపు పూర్తి అసమర్థత కనిపిస్తుందని జస్టిస్ బీఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇది పూర్తి సున్నితత్వం కూడిందని.. ఈ విషయాన్ని చెప్పడానికే తమకు బాధగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి సమాధానాలను కోరింది.
ఇది కూడా చదవండి: AP Liquor scam: సీఎం చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ.. లిక్కర్ స్కామ్‌పై సీరియస్‌గా సర్కార్..!
ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా సమాజమంతా నిరసనగళం ఎత్తారు. ఇక ఈ తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తీవ్రంగా ఖండించారు. ఈ తీర్పును సుప్రీంకోర్టు పున:సమీక్షించాలని కోరారు. ఇలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వ్యా్ఖ్యానించారు.
అలహాబాద్ హైకోర్టు తీర్పు తీవ్ర వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించి.. హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టి స్టే విధించింది.
అసలేం జరిగిందంటే..
2021, నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో గ్రామానికి చెందిన పవన్, ఆకాష్ గ్రామంలో దించుతామంటూ బైక్ ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో
కిందకు దింపి వక్షోజాలను పట్టుకుని.. కల్వర్టు కిందకు లాగే ప్రయత్నం చేశారు. ఇంకొకరు ఆమె ప్యాంట్‌ను కిందకు లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బాలిక హాహాకారాలు విని స్థానికులు రక్షించారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదుతో ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది.
ఇది కూడా చదవండి: Chennai: చెన్నైలో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ జాఫర్ గులాం హుస్సేన్ హతం
Supreme Court stays the Allahabad High Court’s ruling, which stated that grabbing a minor girl’s breasts, breaking her pyjama and trying to drag her beneath a culvert would not come under the offence of rape or an attempt to rape.
A bench headed by Justice BR Gavai says it is a… pic.twitter.com/p0R3QTBvDC
— ANI (@ANI) March 26, 2025