ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీజేపీకి స్పష్టమైన మేజిక్ ఫిగర్ దాటింది. కానీ ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం చాలా ఆలస్యం అయింది. దీనికి కారణం.. ఆ సమయంలోనే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు.
భారత ప్రధాని మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాణిజ్య సుంకాలపై చర్చలు జరిగాయి. అయితే శుక్రవారం ఇదే అంశంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు.
శక్తివంతమైన భూకంపాలతో గజగజలాడిన మయన్మార్, థాయిలాండ్‌కు కష్టకాలంలో సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. శుక్రవారమే అండగా ఉంటామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేరకు భారత విదేశాంగ శాఖ చొరవ చూపించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో పచ్చని అడవి రక్తసిక్తమైంది. శనివారం సుక్మా జిల్లాలోని ఉపంపల్లిలోని గోగుండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ను తన సొంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్ డాలర్ల ఆల్ స్టాక్ డీల్‌లో విక్రయించినట్లు మస్క్ బిలియనీర్ ప్రకటించారు. ఎక్స్ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు.
కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన ఓఎంసీ కేసును సీబీఐ కోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ శుక్రవారం ముగిసింది. ఓఎంసీ కేసులో తుది తీర్పును మే 6న సీబీఐ కోర్టు వెల్లడించనుంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ట్రయల్ పూర్తి చేసింది. ఓఎంసీ కేసులో 2011లో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైన కేసు నమోదైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూప్రకంపం చోటుచేసుకుంది.
మయన్మార్, బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భూకంపాలు కారణంగా 1000 మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది ఉంటారని అనుమానిస్తు్న్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.