తమిళనాడు రాజధాని చెన్నైలో ఎన్‌కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు. మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్టులో గులాం హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానంటూ పోలీసులను జాఫర్ బయటకు తీసుకెళ్లాడు. సంఘటనాస్థలికి వెళ్తుండగా మార్గమధ్యలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో జాఫర్‌పై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. తరమణి సమీపంలో పోలీసుల కాల్పుల్లో జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు.
ఇది కూడా చదవండి: CM Yogi: ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారు..
జాఫర్ గ్యాంగ్ చెన్నైలో వరుస చైన్ స్నాచింగ్‌లు పాల్పడుతోంది. సోమవారం ఒక్కరోజే ఆరు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ ఘటనలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. చైన్‌స్నాచర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగానే జాఫర్‌ను పోలీసులు మట్టుబెట్టారు.
ఇది కూడా చదవండి: Fake Seeds: మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు..