ఢిల్లీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదు వ్యవహారం కేసు పెను సంచలనంగా మారింది. అటు న్యాయస్థానాలు.. ఇటు పోలీసుల మధ్య తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే అగ్నిప్రమాద సమయంలో దొరికిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదంటూ జడ్జి యశ్వంత్ వర్మ తోసిపుచ్చుతున్నారు. స్టోర్‌రూమ్‌లో తాను కానీ.. కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ డబ్బు ఉంచలేదని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు న్యాయమూర్తిని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ అవినీతి జడ్జి తమకు వద్దంటూ బార్ అసోసియేషన్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారమంతా తీవ్ర గందరగోళంగా మారింది. వర్మను ఎవరైనా టార్గెట్ చేశారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? దీన్ని తేల్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే మార్చి 14న వచ్చిన మూడు ఫోన్స్ కాల్స్ ఇప్పుడు మిస్టరీగా మారాయి. ఆ ఫోన్ కాల్స్‌పై ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అసలెందుకు ఫోన్ చేశారు. ఆ వెంటనే మరొక కాల్ చేసి వద్దనడం.. మూడో కాల్ చేసి వివరించడం.. ఇలా సందిగ్ధం.. అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇది కూడా చదవండి: AP: ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థి హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
మార్చి 14న రాత్రి మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. మొదటి కాల్ రాత్రి 11:35కి వచ్చింది. హెల్ప్‌లైన్ నంబర్ 101కి ఫోన్ కాల్ చేసి న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం అంటూ సమాచారం ఇచ్చారు. అంతలోనే ఢిల్లీ అగ్నిమాపక సేవలు (డీఎఫ్ఎస్)కి రెండో కాల్ వచ్చింది. అంతా అదుపులో ఉందని.. ఎలాంటి తొందరలేదని.. ఫైర్ సిబ్బందిని తొందరపెట్టాల్సిన అవసరం లేదని కాల్ వచ్చింది. అనంతరం మూడో ఫోన్ కాల్ వచ్చింది. ఇలా వెంట వెంటనే మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి. వాస్తవానికి సాంకేతిక పరంగా రెండో ఫోన్ కాల్‌ను ‘స్టాప్ కాల్’ అని పిలుస్తారు. ప్రమాద స్థలిని తనిఖీ చేసి.. అనంతరం ప్రధాన కార్యాలయంలోని అధికారులకు సమాచారం తెలియజేసే కాల్‌నే స్టాప్ కాల్ అంటారు. ఇది ఒక సాధారణ పౌరుడు చేయడానికి వీలుండదు. అలాంటిది రెండో కాల్ చేసి.. ఫైర్ సిబ్బందిని రావొద్దని చెప్పింది ఎవరు? అసలా వ్యక్తి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది. దీనిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఇదిలా ఉంటే న్యాయమూర్తి యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు కొలీజియం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా తెలియజేసింది. ఇక ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక ఆధారంగా వర్మ నివాసంలో దొరికిన నగదు ఫొటోలు, వీడియోలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: SRH vs DC: మరోమారు ఆకాశమే హద్దుగా చెలరేగనున్నారా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎస్‌ఆర్‌హెచ్