బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా.. లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. జంగిల్ రాజ్ కావాలా? డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా? బీహార్ ప్రజలు తేల్చుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలిస్తోందని.. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసన్నారు. గతంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బీహార్‌ను నాశనం చేశారని విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేయలేనిది.. కేవలం 10 ఏళ్లలోనే మోడీ అభివృద్ధి చేసి చూపించారన్నారు. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. ఐదేళ్లలో బీహార్‌ను వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని… 13 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ. 8,000 కోట్లతో ఏడు వంతెనలను నిర్మిస్తామని.. బీహార్‌లో ఒక మఖానా బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan : కమల్ హాసన్ అందరి ముందే నన్ను తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం లాలూ తనయులు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని.. కుమార్తె ఏమో పార్లమెంట్‌లో ఉన్నారని.. భార్య ఏమో శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారని.. ఇలా కుటుంబాన్ని పదవుల్లో సెట్ చేసే పనిలో లాలూ బిజీగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం యువకులు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిందని.. బీహార్‌లో కూడా సీతకు మాతా జానకికి ఆలయాన్ని నిర్మించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని అమిత్ షా అన్నారు.
ఇది కూడా చదవండి: Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!