స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇరాకటంలో పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయనపై మహారాష్ట్రలో మూడు కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో ఆగ్రహం రేపింది. దీంతో కునాల్ కమ్రా నిర్వహించిన క్లబ్‌పై కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఆయనపై కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నీ మీ కోసం ఒకే చోట
ప్రస్తుతం కునాల్ కమ్రా తమిళనాడులో ఉన్నారు. తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు పలుమార్లు
సమన్లు జారీ చేశారు. కానీ హాజరుకాలేదు. అరెస్ట్ చేయాలంటూ ముంబై పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కానీ సాధ్యం కాలేదు. ఇదిలా ఉంటే అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టును కునాల్ కమ్రా ఆశ్రయించారు. దీంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇక కునాల్ క్రమా వ్యాఖ్యలపై ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ.. సుపారీ ఇచ్చి మాట్లాడించినట్లుగా ఉందని పేర్కొన్నారు. శివసేన కార్యకర్తల దాడిని సమర్థించబోనని.. కానీ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు మద్దతుగా నిలిచారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు వరుస షాక్‌లు.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్!