మయన్మార్ అధికారులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సంభవించిన శక్తివంతమైన భూకంపంపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సహాయ చర్యలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారత్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మోడీ భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Rithika : క్రేజీ ఆఫర్లు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ
ఇప్పటికే మయన్మార్‌కు అండగా ఉంటామని ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా శుక్రవారం 15 టన్నుల సహాయ సామగ్రిని మయన్మార్‌కు విదేశాంగ శాఖ పంపించింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’లో భాగంగా విపత్తు సహాయక సామగ్రి, దళాలను పంపిస్తున్నట్లు మోడీ తెలిపారు. మరింత సాయం పంపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7, 7.4 తీవ్రత నమోదైంది. ఇక ఈ ఘటనలో దాదాపు 1000 మందికిపైగా చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా ఇంకా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: IPL Ticket: “నిలువు దోపిడీ” ఐపీఎల్ టికెట్ రూ.2,343.. ట్యాక్స్ పేరిట రూ.1,657 వసూలు!