మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని, పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇకత్ చీరలను పరిచయం చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ మంగళవారం ఉదయం పంజాబ్‌లోని ఆదంపూర్‌లో వాయుసేనను కలిసి ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రదర్శించిన తీరును కొనియాడారు.
మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు హైకోర్టు మరో షాకిచ్చింది. మంత్రిపై నమోదైన కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం మంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ రాశారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లేఖ రాశారు.
ప్రతిపక్షానికి భయపడే ప్రధాని మోడీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీహార్‌లోని మిథిలా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించేందుకు దర్భాంగా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది.
వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
టర్కీపై భారతీయుల బాయ్‌కట్ ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులను.. పర్యాటకరంగాన్ని నిషేధించారు. ఇలా ఒక్కొక్కటిగా టర్కీకి సంబంధించిన వాటిపై నిషేధం కొనసాగుతోంది.
సొంత పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటినట్లుగా హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ వర్గాల అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.