దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. గురువారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ చివరి గంటలో మరింత ఊపు కొనసాగించింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,200 పాయింట్లు లాభపడి 82, 530 దగ్గర ముగియగా.. నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 25, 062 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Balakrishna : జైలర్-2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య..?
ఇక నిఫ్టీలో హీరో మోటాకార్ప్, జెఎస్‌డబ్ల్యూస్టీల్, ట్రెంట్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడ్డాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, మీడియా, ఐటీ, ఆటో, బ్యాంక్ 1-2 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Son Calls his Father: నాన్నా నన్ను చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు..! సౌదీ నుంచి ఏపీ యువకుడి ఫోన్..