మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు హైకోర్టు మరో షాకిచ్చింది. మంత్రిపై నమోదైన కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం మంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేవలం ధర్మాసనం ఆదేశాల మేరకే కేసు నమోదు చేశారు కానీ.. ఎలాంటి సెక్షన్లు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల తీరును తప్పుపట్టింది. కేసు నమోదు చేసిన విధానం చూస్తే.. విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రిపై నమోదైన కేసును కోర్టు పరిధిలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
ఇటీవల భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె చాలా పాపులర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Turkey: జేఎన్‌యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..
అయితే మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా.. కల్నల్ సోఫియా ఖురేషి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు.. మన సోదరీమణులు సిందూరం తుడిచేస్తే.. పాకిస్థాన్‌పైకి ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ.. సారాంశమిదే..!
అయితే బుధవారం మధ్యప్రదేశ్ హైకోర్టు.. మంత్రిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌కు ఆదేశించింది. గురువారం ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు నమోదు చేసిన విధానం నమ్మకం కలిగించలేదని న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్ మరియు అనురాధ శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇండోర్ పోలీసులు రూపొందించిన ఎఫ్‌ఐఆర్ కోర్టు విశ్వాసాన్ని ప్రేరేపించలేదని పేర్కొంది. దీంతో కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశించింది. ఇక మంత్రి వ్యాఖ్యలను కేన్సర్ మరియు అంతకంటే ప్రమాదకరమైనవి అని అభివర్ణించింది.