అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. జేమ్స్ కామీ ‘‘8647’’ అనే పదాలను పోస్టు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేసిన తుర్కియేపై భారతీయులు నిరసన కొనసాగిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన బెంగళూరు టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్క చెందిన శుభాన్షు శుక్లా బెంళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటున్నాడు.
జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు.
ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు.
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు.
భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పారు.
కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించాలని భారత్-పాకిస్థాన్ నిర్ణయించాయి. ఈనెల 10న డీజీఎంవోలు మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో ఆమె పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. జేపీ నడ్డా సలహాతో పోస్టును తొలగించినట్లు కంగనా రనౌత్ స్పష్టం చేసింది.