దేశంలో కొత్త నోట్లు రాబోతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ.20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల కారణంగా అశోక్‌నగర్ మెట్రో స్టేషన్ షెడ్ దెబ్బతింది. ఇక పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుగుపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఢిల్లీ లలిత్ హోటల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం జరిగింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో ఝలక్ తగిలింది. 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఆప్‌కు రాజీనామా చేశారు. తిరుగుబాటు కౌన్సిలర్లంతా కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ముఖేష్ గోయెల్ నాయకత్వంలో ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ పేరు ప్రకటించారు.
ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా కూటమికి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదని.. బీజేపీ మాత్రం బలంగా ఉందని కొనియాడారు.
ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌ను రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ పూర్తి చేసినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి విలేకరులకు తెలిపారు.
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలపై చర్చించాలని విపక్షాలు కోరాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థపై పోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైన్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని కేంద్రం యోచిస్తోంది.