హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. మెట్రో సంస్థ టికెట్ ధరలను పెంచేసింది. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.
కొత్త ఛార్జీలు ఇవే:
2 స్టాప్‌లు వరకు కనీస ఛార్జీ రూ.12
2-4 స్టాప్‌ల వరకు రూ.18
4-6 స్టాప్‌ల వరకు రూ.30
6-9 స్టాప్‌ల వరకు రూ.40
9-12 స్టాప్‌ల వరకు రూ.50
12-15 స్టాప్‌ల వరకు రూ.55
15-18 స్టాప్‌ల వరకు రూ.60
18-21 స్టాప్‌ల వరకు రూ.66
24 స్టాప్‌లు.. ఆపైన రూ.75 వరకు పెంపు