నైజీరియాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
ఎలాన్ మస్క్ శకం ముగియలేదని.. ట్రంప్‌కు సలహాలు ఇస్తూనే ఉంటారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ తన కాలం ముగియడంతో తప్పుకున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది.
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గురువారం బీహార్ చేరుకున్నారు. అయితే గురువారం భద్రతా సంస్థలకు వాట్సాప్ కాల్ చేసి మోడీని చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య అశాన్య.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని కాన్పూర్‌లో కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలిని మోడీ ఓదార్చారు. మీ బాధలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు మోడీ అన్నారు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అధికారిక నివాసానికి, రాష్ట్ర సచివాలయానికి శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇజ్రాయెల్‌పై మిత్ర దేశం ఫ్రాన్స్ స్వరం మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గళం విప్పారు. గాజా పట్ల ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
ఆపరేషన్ సిందూర్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని.. త్రివిధ దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్‌ను కమలనాథులు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణులు మన దేశ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు.