ఎలాన్ మస్క్ శకం ముగియలేదని.. ట్రంప్‌కు సలహాలు ఇస్తూనే ఉంటారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ తన కాలం ముగియడంతో తప్పుకున్నారు. ఇదే అంశంపై జేడీ వాన్స్ స్పందించారు. అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి మస్క్ చేసిన ప్రయత్నాలు అద్భుతమంటూ ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగిగా వైదొలిగినా.. ట్రంప్ సలహాదారుడిగా మాత్రం వైదొలగలేదని.. ట్రంప్‌కు మస్క్ సలహాలు ఇస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వా్న్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే పని కొనసాగాలని… ఇది అమెరికన్ ప్రజల నుంచి వచ్చి అతి ముఖ్యమైన ఆదేశాలలో ఇదొకటి అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!
ఇక డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నేను రేపు మధ్యాహ్నం 1:30కి ఎలాన్ మస్క్‌తో కలిసి ఓవల్ ఆపీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాను. ఇది అతని చివరి రోజు అవుతుంది. కానీ నిజంగా కాదు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మస్క్ అద్భుతంగా పని చేశాడు. రేపు వైట్‌హౌస్‌లో కలుద్దాం.’’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో ఒకేసారి రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు.. రంగంలోకి హైడ్రా బృందాలు..!
ఇక ఎలాన్ మస్క్ కూడా ‘‘ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ సమయం ముగియడంతో వృధా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డీవోజీఈ మిషన్ కాలక్రమేణా బలోపేతం అవుతుంది.’’ అంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
"I am having a Press Conference tomorrow at 1:30 P.M. EST, with @ElonMusk, at the Oval Office. This will be his last day, but not really, because he will, always, be with us, helping all the way. Elon is terrific! See you tomorrow at the White House." –President Donald J. Trump… pic.twitter.com/7qF1SC1KJb
— The White House (@WhiteHouse) May 30, 2025