పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య అశాన్య.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని కాన్పూర్‌లో కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలిని మోడీ ఓదార్చారు. మీ బాధలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు మోడీ అన్నారు.
ఇది కూడా చదవండి: NTR Film Awards: వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం
శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా శుభం ద్వివేది కుటుంబ సభ్యులు మోడీని కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మోడీ ఆరా తీశారు. అనంతరం అశాన్య మీడియాతో మాట్లాడుతూ.. మాతో మాట్లాడినప్పుడు మోడీ భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. మరోసారి మళ్లీ కలుస్తానని మోడీ చెప్పినట్లుగా తెలిపింది.
ఇది కూడా చదవండి: దివి నుంచి దిగి వచ్చావా రీతూ చౌదరీ? ఇంత అందమా?
కాన్పూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త శుభమ్ ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి 12న అశాన్యను వివాహం చేసుకున్నాడు. హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లారు. ఏప్రిల్ 22న బైసరన్ లోయలో ఉన్నారు. హఠాత్తుగా ఉగ్రవాదులు వచ్చి ద్వివేదిని కాల్చి చంపారు. మొత్తం 26 మందిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. అందులో శుభమ్ ద్వివేది ఒకరు.
తాము మాగీ తినడానికి బయటకు అడుగుపెట్టినప్పుడు వెనుక నుంచి ఒక వ్యక్తి తుపాకీతో దగ్గరకు వచ్చాడని.. శుభమ్‌ను నువ్వు హిందువా? లేక ముస్లింవా? అని అడిగాడని.. నువ్వు ముస్లిం అయితే కల్మా పఠించు అని అడిగాడని తెలిపింది. కల్మా పఠించకపోవడంతో వెంటనే తుపాకీ తీసుకుని తలపై కాల్చాడని.. తన కళ్ల ముందే ద్వివేది ప్రాణాలు కోల్పోయినట్లు అశాన్య గుర్తుచేసింది. తనను కూడా మతం అడిగాడని.. తాను హిందువునని చెప్పినప్పుడు తనను కాల్చలేదని పేర్కొంది. నువ్వు వెళ్లి మోడీకి ఇక్కడ ఏం జరిగిందో చెప్పమన్నాడని.. హిందువులను ఇలానే చంపేస్తామని ఉగ్రవాది బెదిరించినట్లుగా అశాన్య గుర్తుచేసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.