ఇజ్రాయెల్‌పై మిత్ర దేశం ఫ్రాన్స్ స్వరం మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గళం విప్పారు. గాజా పట్ల ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కచ్చితంగా పాలస్తీనా దేశం ఉండాల్సిందేనని మాక్రాన్ తేల్చి చెప్పారు. ఇక గాజా పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. గాజాలో మానవీయ సాయాన్ని అడ్డుకోవడం భావ్యం కాదని.. ఇలాగైతే టెల్ అవీవ్‌పై కఠిన వైఖరి అవలంభించాల్సి వస్తోందని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల సిద్ధాంతానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో కలిసి మాట్లాడుతుండగా మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Kidney Racket: కిడ్నీ రాకెట్ మాఫియాలో విస్తుపోయే అంశాలు.. భారత్‌లో కిడ్నీ దందా నడిపిన శ్రీలంక వాసి..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్.. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కచ్చితంగా పాలస్తీనా దేశం ఉండాల్సిందేనని మాక్రాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌కు ఆగ్రహానికి తెప్పించాయి. అంతేకాకుండా జూన్ 17-20 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాలస్తీనా ఏర్పాటుకు సౌదీ అరేబియాతో కలిసి ఫ్రాన్స్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు.. అందుకే పట్టుకోవడం లేదు
ఇదిలా ఉంటే తాజాగా అమెరికా సాయంతో ఇజ్రాయెల్.. హమాస్‌కు కొత్త ప్రతిపాదన పెట్టింది. 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరిస్తూ బందీలను విడుదల చేయాలని హమాస్ ముందు ప్రతిపాదన పెట్టగా తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదన పూర్తి వ్యతిరేకంగా ఉందని.. కేవలం బందీల విడుదల కోసమే ప్రతిపాదన ఉందని.. కానీ యుద్ధం ముగింపునకు మాత్రం ఎలాంటి చర్చలు జరపలేదని హమాస్ నేత మీడియాకు వెల్లడించారు. అందుకే అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినట్లు హమాస్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Hamas-US: కాల్పుల విరమణపై అమెరికా చర్చలు.. హమాస్ తిరస్కరణ