ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గురువారం బీహార్ చేరుకున్నారు. అయితే గురువారం భద్రతా సంస్థలకు వాట్సాప్ కాల్ చేసి మోడీని చంపేస్తామంటూ బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన భద్రతా అధికారులు.. భాగల్‌పూర్‌కు చెందిన సమీర్ రంజన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు వేరొక వ్యక్తి మొబైల్ నుంచి బెదిరించినట్లుగా గుర్తించారు. నిందితుడికి ఆస్తి వివాదం ఉండడంతో ఆ వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఈ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: PL 2025: ఫైనల్‌లో ఆర్సీబీ ఓడిపోతే.. నా భర్తకు విడాకులు ఇచ్చేస్తా..
ప్రధాని మోడీ గురు, శుక్రవారాల్లో బీహార్‌లో పర్యటించారు. భాగల్పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేషి గ్రామానికి చెందిన సమీర్ రంజన్.. 71 ఏళ్ల మంతు చౌదరి మొబైల్ ఫోన్ తీసుకుని.. భద్రతా సంస్థలకు ఫోన్ చేసి.. మోడీని చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంతు చౌదరిని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. దీంతో మరింత లోతుగా విచారిస్తే.. తన ఫోన్‌ను రంజన్ ఉపయోగించినట్లుగా తెలిపాడు. దీంతో రంజన్‌ను అరెస్ట్ చేశారు. మంతు చౌదరితో రంజన్‌కు ఆస్తి వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంతు చౌదరిని ఇరికించేందుకు ఈ ప్లాన్ చేసినట్లుగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Anchor Shyamala: పులివెందులలో యాంకర్ శ్యామల పర్యటన.. అందుకే నా పయనం..!
త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఇందులో భాగంగా ప్రధాని మోడీ రెండు రోజులు బీహార్‌లో పర్యటించారు. శుక్రవరం రోహ్తాస్‌లోని కరకట్‌లో రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్‌లను మోడీ ప్రారంభించారు.