నైజీరియాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇళ్లులు, కార్లు, మనుషులు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 111 మంది మృతదేహాలను వెలికితీయగా… మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: GT vs MI: చితకబాదిన హిట్‌మ్యాన్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం..!
గత సెప్టెంబర్‌లో కూడా ఇదే తరహాలో వరదలు ముంచెత్తాయి. అప్పుడు కూడా ఆనకట్టలు తెగిపోవడంతో 30 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే బోకో హరామ్ తిరుగుబాటుతో మానవతా సంక్షోభం ఏర్పడగా.. వరదలతో పరిస్థితి మరింత దిగజారింది. నైజీరియా తరచుగా వరదలను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల కారణంగా స్వల్ప కాలంలోనే భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా వచ్చిన వర్షాలు కూడా అలాంటివే. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!
At least 30 killed after torrential rains triggered flooding chaos in Niger, Mokwa #Nigeria#Africa #Flood #Mokwa #Flashflood #Rain #Climate #Weather #Viral pic.twitter.com/x2dI0JsoE8
— Earth42morrow (@Earth42morrow) May 30, 2025
Rescuers in Nigeria are continuing to recover bodies after flash flooding killed at least 36 people. Torrential rain swept away more than 50 homes in Niger state. pic.twitter.com/wfkFtbnKuy
— Al Jazeera English (@AJEnglish) May 30, 2025