Hamas-US: కాల్పుల విరమణపై అమెరికా చర్చలు.. హమాస్ తిరస్కరణ
- కాల్పుల విరమణపై అమెరికా చర్చలు
- పూర్తి వ్యతిరేకంగా ఉందని హమాస్ తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సంతకం చేసిందని వైట్‌హౌస్ తెలిపింది. బందీల విడుదల, ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల, దీనికి బదులుగా చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, అలాగే మృతదేహాలను అప్పగించాలని హమాస్ దగ్గర అమెరికా ప్రతిపాదన పెట్టింది. అందుకు హమాస్ ససేమిరా అంది. యుద్ధం ముగించే ఆలోచన అమెరికా దగ్గర లేదని.. కేవలం బందీల కోసమే అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిందని.. తగిన సమయంలో స్పందిస్తామని హమాస్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఆ ముగ్గురూ సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు.. కిషన్‌రెడ్డి ఫైర్..!
అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. తొలి ఒప్పందం ప్రకారం అంతా బాగానే జరిగింది. తొలి ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. అందుకు హమాస్ అంగీకరించలేదు. దీంతో తిరిగి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేసింది. దీంతో భారీగా నష్టం జరిగింది.
అయితే తాజాగా మరోసారి బందీల విడుదలకు అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ అంగీకరించినా.. హమాస్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ అంటోంది.
ప్రస్తుతం హమాస్ దగ్గర 50 మంది బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. అందులో 20 మంది సజీవంగా ఉన్నట్లు నమ్ముతోంది. అయితే ఇటీవల బాధిత కుటుంబాలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. బందీల ఒప్పందానికి అంగీకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కొత్త ప్రతిపాదన పెట్టింది. అయితే ఇది కేవలం బందీలు-ఖైదీల విడుదలకు మాత్రమే పరిమితమని.. యుద్ధం ముగింపునకు కాదని హమాస్ భావించి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
ఇక ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 22 కొత్త యూదు ఆవాసాల ఏర్పాటుకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఇజ్రాయెల్ ప్రకటించింది. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించింది. అప్పటినుంచి అక్కడికి ఇజ్రాయెలీ పౌరులను తరలిస్తూ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ పౌరుల కోసం వందల సంఖ్యలో అపార్టుమెంట్లు నిర్మించింది. అయితే ఈ తరలింపును వెస్ట్‌బ్యాంక్‌లోని 30 లక్షల మంది పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..