పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మాక్‌డ్రిల్ మే 31కి వాయిదా పడింది. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లో మే 29న భద్రతా విన్యాసాలు చేయాలని కేంద్రం ఆదేశించింది.
కరోనా వైరస్.. భారతదేశంలో ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపి వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఇంకా చాలా కుటుంబాల్లో ఆ దు:ఖ సమయాలు పోలేదు. గత కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ వైరస్ తాజాగా మరోసారి విజృంభిస్తోంది.
క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
భారతీయులు ఎక్కడున్నా సందడిగానే ఉంటారు. ఇక ఏ వేడుక చేసినా గ్రాండ్‌గానే చేస్తారు. చిన్న కార్యక్రమం అయినా... పెద్ద కార్యక్రమం అయినా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏ దేశంలో ఉన్నా ఒకటే పద్ధతి ఉంటుంది.
కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగ వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అర్ధం కాలేదు. జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫయర్ వన్‌కి చేరుతుందని. లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి అంచున ఉండగా.. ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఇరాన్లో పర్యటిస్తూ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి కోరుకునే వాళ్లు చర్చలకు రావాలంటూ వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ దుమ్ము తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ సంభవించొచ్చని సూచించింది. గురు, శుక్రవారాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ప్రధాని మోడీ-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గురువారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వమే లక్ష్యంగా మోడీ విమర్శలు గుప్పించారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.