ఎమ్మెల్సీ కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రపంచ సుందరి-2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
బీజేపీ, కాంగ్రెస్‌కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పేరు ప్రఖ్యాతల కోసమో తెలియదు గానీ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టై జైల్లో ఊచలు లెక్కడుతోంది. తాజాగా లా విద్యార్థిని తన స్థాయి మరిచి ప్రవర్తించింది. దీంతో ఆమె కూడా ఇరాటకంలో పడింది.
జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1గా తీవ్రత నమోదైంది. ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూకంప కేంద్రం హొక్కైడో తూర్పు తీరంలో గుర్తించబడింది.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.