Rekha Gupta: సీఎం రేఖా గుప్తాకు అధికారిక బంగ్లా కేటాయింపు.. కొత్త అడ్రస్ ఎక్కడంటే..!
- ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు అధికార నివాసం కేటాయింపు
- ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో రెండు బంగ్లాలు కేటాయింపు
- ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే ఉంటున్న రేఖా గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎంపిక చేసింది. అయితే అంతకముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు రేఖా గుప్తా నిరాకరించారు. దీంతో షాలిమార్ బాగ్‌లో ఉన్న తన ఇంట్లో నుంచే రేఖా గుప్తా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు ముఖ్యమంత్రికి అధికారిక నివాసం కేటాయించారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మూడు వేలు పెరిగిన వెండి.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ప్లాట్ నంబర్ 8, రాజ్ నివాస్ మార్గ్‌లో అధికారిక నివాసం కేటాయించబడింది. జూన్ 5న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) జారీ చేసిన లేఖ ప్రకారం ఈ నివాసం కేటాయించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత రేఖ గుప్తాకు అధికారిక నివాసం కేటాయించారు.
ఇది కూడా చదవండి: AP Government: రైతు సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్.. కీలక నిర్ణయం
ఈ ప్లాట్‌లోని నాలుగు బంగ్లాల్లో రేఖా గుప్తాకు 1, 2 నంబర్ల బంగ్లాలు కేటాయించారు. అదే సమయంలో 3, 4 నంబర్ల బంగ్లాలు వరుసగా డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్, సాంఘిక సంక్షేమ మంత్రి రవీందర్ ఇంద్రజ్ సింగ్‌కు కేటాయించారు. ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరి భద్రత కల్పించబడినందున నివాస వసతి కేటాయింపుపై హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను బంగ్లాలు పాటిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేటాయింపులపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఈ బంగ్లాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇష్టపడతారా? లేదంటే ఇంకేమైనా బంగ్లాలు పరిశీలిస్తారో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!