ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గురువారం తన నివాసంలో ‘సిందూర’ మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా శౌర్యం, ప్రేరణకు బలమైన చిహ్నంగా సిందూర మొక్క నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: 2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!
1971 యుద్ధంలో అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళల బృందం.. ప్రధాని మోడీకి సిందూర మొక్కను బహుకరించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో ఉండగా ఈ మొక్కను మహిళల బృందం ఇచ్చింది. వారి చర్యకు ముగ్ధుడనై తన నివాసంలో నాటుతానని వారికి హామీ ఇచ్చినట్లు మోడీ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: 9వ తరగతి పాస్‌కాని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నాడు.. తేజస్వి యాదవ్‌పై విసుర్లు
తాజాగా ఆ మొక్కను గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో నాటారు. ఇటీవల భారతదేశం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. తాజాగా నాటిన మొక్క కూడా దానికి సూచనగానే భావిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతి చర్యగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పరుషులను చంపి స్త్రీల సిందూరాన్ని తుడిచేశారు. అందుకోసమే.. ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టారు.
ఇక ప్రపంచ వాతావరణ పరిరక్షణ కోసం ప్రతి దేశం స్వార్థానికి అతీతంగా ఎదగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తమని, గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా భారతదేశం దీనిపై నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश… pic.twitter.com/GsHCCNBUVp
— Narendra Modi (@narendramodi) June 5, 2025