Trump: రష్యా-ఉక్రెయిన్ వార్‌పై కీలక వ్యాఖ్యలు.. చిన్న పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్య
- రష్యా-ఉక్రెయిన్ వార్‌పై కీలక వ్యాఖ్యలు
- చిన్న పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించినా సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాధినేతలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అమెరికా విసుగెత్తిపోయింది.
ఇది కూడా చదవండి: Akhil Akkineni: వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరు దేశాల యుద్ధాన్ని చిన్న పిల్లల గొడవతో పోల్చారు. రెండు దేశాలు చిన్న పిల్లల్లా కొట్టుకోనివ్వండి అని వ్యాఖ్యానించారు. రక్తపాతాన్ని ఆపగల శక్తి ప్రపంచంలో ట్రంప్‌కే ఉందని జర్మనీ కొత్త ఛాన్సలర్ మెర్జ్ అనడం మంచిదేనని.. అయితే రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే కొంత కాలం రష్యా-ఉక్రెయిన్ పోరాడితేనే మంచిది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్‌కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ట్రంప్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకరినొకరు ద్వేషించే పిల్లల మధ్య పోరాటంలా ఉందని వ్యాఖ్యానించారు. తాను కూడా పుతిన్‌కు ఫోన్ చేసి అదే విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో తన పాత్ర పరిమితం అని.. ఇందులో జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ కూడా జోక్యం చేసుకుంటే మంచిదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా మధ్యవర్తిగా సౌదీ అరేబియాలో రష్యన్ అధికారులతో చర్చలు జరిపారు. అయితే చర్చల సందర్భంగా రష్యా కొన్ని షరతులు పెట్టింది. దీంతో ఈ పంచాయితీ ఎటు తెగకుండా పోయింది. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా మరోసారి చర్చలకు సిద్ధపడుతుండగా ఉక్రెయిన్ ఊహించని రీతిలో రష్యాపై డ్రోన్ల దాడికి తెగబడింది. దీంతో ప్రపంచమంతా షాక్‌కు గురైంది. రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున బాంబర్లు నాశనం అయ్యాయి. అయితే ఇప్పటి వరకు రష్యా ప్రతీకార దాడి చేయలేదు.
- Tags
- america
- Kids Brawl
- Putin
- Russia
- trump
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!