RBI: ఈఎంఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరోసారి రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ
- ఈఎంఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
- మరోసారి రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపోరేటును తగ్గించింది. 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రెపోరేటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గించింది. దీంతో హోమ్ లోన్, వెహికల్, పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Shubman Gill: ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!
Also Read
ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం వరకు తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరంగా కొనసాగుతోంది. వేగంగా వృద్ధి చెందుతోంది. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు.. ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని, స్వల్పకాలిక, మధ్యకాలిక అంచనాలు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని మల్హోత్రా అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం అంచనాలు ఇప్పటికీ మృదువుగా ఉన్నాయని, ప్రధాన ద్రవ్యోల్బణం సానుకూలంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4 శాతం ఉంటుందని అంచనా వేయగా.. అది 3.7 శాతం దగ్గర ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. వివిధ ఆర్థిక సూచికలు మాత్రం బలంగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధిని ఆర్బీఐ 6.5 శాతంగా అంచనా వేసింది. త్రైమాసిక అంచనాలు: 2.9 శాతం (ఏప్రిల్-జూన్), 3.4 శాతం (జూలై-సెప్టెంబర్), 3.9 శాతం (అక్టోబర్-డిసెంబర్), మరియు 4.4 శాతం (జనవరి-మార్చి) అంచనా వేసింది.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!