PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
- ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
- జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుంది.
ఇది కూడా చదవండి: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు. రేపటి నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైళ్లు పరిగెత్తనున్నాయి. ప్రారంభోత్స సమయంలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హిట్ మూవీ!
Visited the tallest railway bridge in the world, The Chenab Bridge, to review arrangements for the visit of the Hon PM @narendramodi ji tomorrow. Tomorrow is a landmark day for J&K when, finally, the valley will be connected to the rest of the country by a railway link to be… pic.twitter.com/bthZVHQ33j
— Omar Abdullah (@OmarAbdullah) June 5, 2025
दृढ़ प्रतिज्ञ सोच लो,
प्रशस्त पुण्य पंथ है,
बढ़े चलो-बढ़े चलो।📍Anji bridge, J&K pic.twitter.com/I9QRhoOkW3
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 6, 2025
History in the making… Just 3 days to go!
The mighty #ChenabBridge, the world’s highest railway bridge, stands tall in #JammuandKashmir.
Part of the Udhampur-Srinagar-Baramulla Railway Link (USBRL). Built to withstand nature’s toughest tests.
PM Sh @narendramodi to… pic.twitter.com/EQnC0m1per
— Dr Jitendra Singh (@DrJitendraSingh) June 3, 2025
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?