తన భర్త వదిలిపెట్టి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు. బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. చార్లీ కిర్క్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేష కృషి చేశాడు. అంతేకాకుండా చార్లీ కిర్క్ జాతీయవాది. దేశం కోసం ఎక్కువగా పరితపిస్తుంటాడు. భర్త మరణం తర్వాత మొట్టమొదటి సారిగా చార్లీ కిర్క్ భార్య ఎరికా భావోద్వేగ ప్రసంగం చేసింది. భర్త కూర్చోనే సీటు పక్కన ఖాళీ చైర్ దగ్గర నిలబడి ప్రసంగించింది.

తన భర్త కుటుంబం కోసం.. దేశం కోసం జీవితాన్ని అర్పించారని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన తర్వాత తన భర్తకు వేగవంతంగా చికిత్స, దైర్యం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆద్యంతం దు:ఖంతోనే ఎరికా ప్రసంగించారు. ఈ సందర్భంగా బైబిల్‌లోని వాక్యాన్ని గుర్తు చేస్తూ క్రీస్తు ప్రేమించినట్టుగానే.. కుటుంబాన్ని చార్లీ కిర్క్ ఎంతగానో ప్రేమించేవారిని గుర్తుచేశారు. ఈ విషాద సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అండగా నిలిచారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. వారిద్దరితోనూ చార్లీకి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. చార్లీ ఎప్పుడూ అమెరికా కుటుంబాన్నే ఎక్కువగా ప్రేమించేవారిని.. దేశం కోసం పరితపించేవారని పేర్కొన్నారు. చార్లీకి దేవుడే తోడుగా ఉంటాడని చెప్పారు. చార్లీ చేపట్టిన ఉద్యమాన్ని తాను వారసత్వంగా కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ వితంతువు కేకలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ కేకలా ప్రతిధ్వనిస్తాయని ప్రకటించారు. తన భర్త నిర్మించిన ఉద్యమం చనిపోదు.. చనిపోనివ్వని స్పష్టం చేశారు. ముగింపులో దేవుడు అందరినీ దీవించును గాక.. అమెరికాను దీవించును గాక అంటూ ముగించారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: గుడ్‌న్యూస్.. 4,687 అంగన్వాడీ హెల్పర్ల నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్..
బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఒక్క తూటాకే కుప్పకూలిపోయాడు. ఇక 33 గంటల తర్వాత 22 ఏళ్ల నిందితుడు టైలర్ రాబిన్సన్ అరెస్ట్ చేశారు.
— Turning Point USA (@TPUSA) September 13, 2025