కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
డీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న విషయం విదితమే కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల సమయంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.. అంతే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు.
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.