CM YS Jagan: మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ నెల 30వ తేదీన నంద్యాల, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయబోతున్నారు.. అదే రోజు కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక, ఈ పర్యటన కోసం ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. మొదట నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి చేరుకుంటారు.. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు చేరుకుంటారు.. నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్.. ఇక, ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.. అక్కడి నుంచి నేరుగా కడపకు చేరుకుంటారు సీఎం జగన్.. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొంటారు.. రెండు జిల్లాల పర్యటన ముగించుకుని 30వ తేదీన సాయంత్రం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కాగా, ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా గడుపుతున్నారు సీఎం వైఎస్ జగన్.. ఓవైపు సమావేశాలు, మరోవైపు సభలు.. రివ్యూలు ఇలా నిత్యం ఏదో ఒక ఇష్యూపై ఫోకస్ చేస్తూనే ఉన్నారు.