Andhra Pradesh: ఎన్నికల విధులకు దూరంగా గ్రామ వాలంటీర్లు.. సుప్రీంకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించవద్దని, వారిని ఎన్నికల విధులకు దూరం పెట్టాలంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ.. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అక్రమాలకు తావిస్తున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో దాఖలో చేసిన పిల్‌లో పేర్కొంది సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ. వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఐప్యాక్, రామ్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థల ద్వారా ప్రొఫైలింగ్ చేయించడంపై పరిశీలన కోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్నికి విజ్ఞప్తి చేసింది..
Read Also: Pooja Gandhi: పెళ్లి పీటలెక్కబోతున్న పూజా గాంధీ.. వరుడు ఎవరంటే?
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ఇక, గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల సంబంధ విధుల నుంచి పూర్తిగా తప్పించాలని కోరింది సిటిజన్ ఫర్ డెమొక్రసీ.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సేవలను ఉపయోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరింది సిటిజన్ ఫర్ డెమొక్రసీ.. ఇక, దీనిపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు సాగనున్నాయి.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్వహణకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వినియోగిస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పంచాయతీ వెళ్లడంతో ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!