Supreme Court: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది.. ఇక, ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ జరపనుంది.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరులోతమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందంటున్నారు పిటిషనర్.. ఈ కేసులో సుప్రీంకోర్టు వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది.
Read Also: Hanuman Puja : హనుమాన్ ను ఇలా పూజిస్తే చాలు.. కష్టాలన్నీ మాయం..