Gudivada Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ఎపిసోడ్, చంద్రబాబు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకొచ్చిన ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు శేష జీవితం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సిందేనని జోస్యం చెప్పారు. మనవడు దేవాన్ష్ తో తాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాడని చెప్పిన నారా భువనేశ్వరి.. ఇప్పుడు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు […]
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కింగ్ మేకర్స్ కాదు.. మేమే కింగ్లం అంటూ ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికీ మేనెఫెస్టో తీసుకురాలేకపోయారు.. ఇప్పటి వరకు వివేక్ నేతృత్వంలో మేనిఫెస్టోపై ఏదైనా కసరత్తు జరిగినా.. ఆయనే పార్టీకి గుడ్బై చెప్పడంతో ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయ్యింది.. తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం తామే అంటున్న బీఆర్ఎస్.. ఎప్పుడు మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించి.. ఇంకా ఎప్పుడు మేనిఫెస్టో తీసుకు వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.