ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ఘటన జరిగిన గంటల 14 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించాం.. ఎమ్మార్వో హత్య కేసుకు ల్యాండ్ ఇష్యు నే కారణంగా పేర్కొన్నారు. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఎమ్మార్వో హత్యకు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి..
విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ - జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srikalahasthi Temple: శ్రీకాళహస్తీ ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేగింది.. ఓ బాలుడు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన రచ్చగా మారింది.. ఆలయం మూసివేసిన తరువాత 13 సంవత్సరాల వయసులో ఉన్న మైనర్ బాలుడు ఆలయ ప్రహరీ గోడ నుండి నిచ్చెన ద్వారా ఆలయంలోకి ప్రేవేశించాడు.. తిరిగి అదే గోడ దూకుతుండగా కార్ పార్కింగ్ వద్ద బాలుడ్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఆలయ సీసీ కెమెరాలో సైతం బాలుడు ఆలయంలో తిరుగుతున్న దృశ్యాలు రికార్డు […]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..