Shivaratri 2024 Special Song: శివరాత్రి వస్తుందంటే చాలు భక్తుల ఉపవాస దీక్షలు, శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగిపోతుంటుంది.. ఇక, శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగిపోతుంటాయి.. ఆదిదేవుని పాటలు, భజనలతో భక్తులు మునిగితేలుతుంటారు.. శివ పార్వతుల కల్యాణం జగత్తు కళ్యాణానికి నాంది అయింది.. కాబట్టే శివరాత్రి విశ్వానికి పండుగ రోజుగా మారిందని పుణాలు చెబుతున్నాయి.. అందుకే శివరాత్రిని హిందువులంతా పెద్ద పండుగగా చేసుకుంటారు.. మరి కొన్ని రోజుల్లో శివరాత్రి రాబోతున్న తరుణంలో.. ఈ ఏడాది కూడా శివరాత్రికి ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను తీసుకురాబోతోంది ‘వనిత టీవీ’.. గతంలోనూ వనిత టీవీ శివరాత్రికి తీసుకొచ్చిన ప్రత్యేక గీతాలు ఎంతో ఆకట్టుకోగా.. ఇప్పుడు ‘ఆదియోగి’ పేరుతో మరో స్పెషల్ సాంగ్ తీసుకొస్తున్నారు..
Read Also: Tollywood Heroines : సోలోగా ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్స్ వీళ్లే…
ఇక, ‘ఆదియోగి’కి సంబంధించిన ప్రోమోను ఈ రోజు విడుదల చేసింది వనిత టీవీ.. భక్తి గీతాలకు పెట్టింది పేరైన సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు.. “నీ పాదధూళి రాలిన విభూదిని.. తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమే.. దింగబర జగంబులో నీ సాటి ఎవరు రా? అహంబును వీడనాడినానురా నీ సేవలు.. ఆది యోగి.. అరుణాచల శివ.. ఆదియోగి.. గౌరీ శంకర ఆదియోగి..’ అంటూ సాగుతోన్న ‘ఆదియోగి’ సాంగ్ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. పూర్తి సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తారా అనే హైప్‌ను క్రియోట్‌చేస్తోంది ఆదియోగి ప్రోమో.. ఆది యోగి సాంగ్ ప్రోమో వినేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..