నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు అనగా 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. అయితే, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు అధికారులు..
వైసీపీ, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.