AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత చెలరేగిన హింసతో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు.. మరోవైపు.. ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. డీజీపీ, ఎన్నికల కమిషన్, గవర్నర్.. ఇలా వైసీపీ, టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. మరోవైపు.. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ మేరకే ఏపీ సీఈవోకు లేఖ రాసిన ఆయన.. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్‌తో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజే పాటలతో పార్టీ నిర్వహించారని.. ఈ పార్టీలో 450 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. అంతా కాదు.. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్‌పీ అట్టాడ బాపూజీ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. మరోవైపు, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, రెండు పేజీల తన లేఖకు ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలను కూడా జత చేశారు చంద్రబాబు నాయుడు.
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్