AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా… హింస్మాతక ఘటనలు మాత్రం ఆగడంలేదు. పల్నాడు జిల్లాలో నిన్న కూడా టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేటతోపాటు మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
తాడిపత్రిలోనూ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాడేపల్లి నియోజకంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తాడిపత్రి పట్టణంలోనూ 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. కడప, జమ్మలమడుగులోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. అభ్యర్థులు, కీలక నేలను ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. అభ్యర్థుల ఇంటి దగ్గర కూడా… భద్రత పెంచారు. ఇక, 144 సెక్షన్ అమల్లో ఉన్న చోట… గుంపులుగా బయట తిరగకూడదు. రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. సభలు, సమావేశాలు పెట్టకూడదు. నిబంధనలు మీరితే… కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచర్చించారు.
కాగా, ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై… సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. నిన్న, ఇవాళ…. తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. నర్సరావుపేటలోనూ పోలింగ్ రోజున…. టీడీపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైనా ప్రతిదాడికి దిగారు ప్రత్యర్థులు. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన గొడవలు… హింసాత్మకంగా మారుతుండటంతో… కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పోలింగ్ తర్వాత హింసను ఎందుకు అరికట్టలేకపోయాలో వివరించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ.