Intelligence High Alert: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి.. ఇక, పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు అంతా ప్రశాంతంగా కనిపిస్తోన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది.. అల్లర్లకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కొందరిపై ఎన్నికల కమిషన్ వేటు కూడా వేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు మళ్లీ కలవరపెడుతున్నాయి.
Read Also: Nandamuri Rama Krishna: రికార్డు ఓటింగ్.. తెలుగు జాతి మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ 4వ తేదీ తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది ఇంటెలిజెన్స్.. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూలహా ఇచ్చింది. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది ఇంటెలిజెన్స్.. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖను హెచ్చరించింది ఎన్నికల కమిషన్.. ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 15 రోజుల వరకు 25 కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరికలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..