Crime News: మద్యం తాగిన తర్వాత.. మాటామాట పెరిగి ఘర్షణకు దిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొన్ని ఘర్షణతో ఆగిపోతే.. మరికొన్ని ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి ఘటనలు లేకపోలేదు.. తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియక.. ప్రాణాలు తీసిన ఘటన ఇప్పుడు మరొకటి వెలుగుచూసింది.. వైన్ షాపు దగ్గర ఇద్దరి మధ్య మద్యం విషయంలో తలెత్తిన గొడవ కాస్తా.. ఓ వ్యక్తి హత్యకు దారితీసింది.. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగుచూసిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పగిదెల శ్రీనివాసరావు (52)ను బీరు సీసాతో పొడిచి హత్య చేశాడు గంట నరేంద్రరెడ్డి.. ఇద్దరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో వైన్ షాపు దగ్గర గొడవ పడడంతో. ..శ్రీనివాసరావును బీరు సీసాను పగలగొట్టి పొడవడంతో ఆ ఘటనా స్థలంలోనే శ్రీనివాసరావు మృతిచెందినట్టు చెబుతున్నారు.. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రుపాలెం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Kajal Aggarwal : ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నా .. అందుకే ‘సత్యభామ’ లో నటించా..