AP Elections 2024: నంద్యాల జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చామని, మళ్లీ 3వ తేదీన మరోమారు శిక్షణ ఇస్తామన్నారు. అయితే, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ణీత సమయాన్ని కంటే గంట ముందే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో నిబంధనలను పాటించాలని, అభ్యంతరాలు ఉంటే ఆర్.ఓ.ను సంప్రదించాలని, వివాదాలకు వెళ్లరాదని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు.
Read Also: Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత
ఇక, కౌంటింగ్ కు ముందు.. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. జిల్లాలోని 75 సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు భద్రత కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించామని, ఎవరైనా డ్రోన్లను ఉపయోగిస్తే సీజ్ చేసి కేసులను పెడతామని హెచ్చరించారు.. మరోవైపు.. ఆళ్లగడ్డ, బనగానపల్లెలకు 90 మంది సభ్యులు ఉన్న బీఎస్ఎఫ్ దళాలను తరలించామని, స్పెషల్ పార్టీ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని చెప్పారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. కాగా, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తో పాటు.. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఫలితాలు కూడా ఈ నెల 4వ తేదీన ప్రకటించనున్న విషయం విదితమే.