AP Exit Polls 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చేశారు ఆరా మస్తాన్.. పనిలో పనిగా గెలిచే ప్రముఖులతో పాటు.. ఓటమి చెందే ప్రముఖ లీడర్ల జాబితాను కూడా వెల్లడించారు.. మొత్తంగా అధికారంలోకి వచ్చేది మాత్రం వైసీపీయే అని.. మరోసారి జగన్ సీఎం అవుతారనే సంకేతాలు ఇచ్చారు.. ఇక, వైసీపీకి కలిసివచ్చే అంశాలపై కూడా కాస్తా క్లారిటీ ఇచ్చారు.. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పొత్తుతో పని చేసారు… పొత్తుల కోసం సమయాన్ని వృధా చేశారని పేర్కొన్నారు. అయితే, వైసీపీ సంక్రాంతికే అభ్యర్ధులను ప్రకటించేసింది.. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో వైసీపీ లాభ పడిందన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు మేలు జరిగింది.. పెన్షన్ విధానం, గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామాల్లో వైసీపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందని వివరించారు.
Read Also: Telangana Exit Poll Results 2024: తెలంగాణలో గెలుపెవరిది?.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..
మన రాష్ట్రంలో 71 శాతం గ్రామీణ ఓటర్లు ఉన్నారని పేర్కొన్న ఆరా మస్తాన్.. 56 శాతం మహిళలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని వెల్లడించారు.. అయితే, 42 శాతం మహిళల ఓట్లు టీడీపీకి పడ్డాయని చెప్పుకొచ్చారు.. ఇక, పురుషుల్లో కేవలం 45.3 శాతం వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తే.. టీడీపీ కూటమికి 51.56 శాతం ఓట్లు పడ్డాయని అంచనా వేశారు. అయితే, మొత్తంగా వైసీపీ 49.41 శాతం ఓట్లతో 94 నుండి 104 సీట్లలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 47.55 శాతం ఓట్లతో ఎనబై సీట్ల వరకూ దక్కించుకునే అవకాశం ఉందన్నారు. ఇక, వైసీపీ 13 లేదా 15 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందన్నారు ఆరా మస్తాన్ రావు.