AP Election Results 2024: అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయ 5 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. ఈ టెలికాన్ఫరెన్స్ లో పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3 పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు.. నిబంధనలకు పట్టుబట్టాలి. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు అని సూచించారు.
ఇక, కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను.. కౌంటింగులో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలని సూచించారు చంద్రబాబు.. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దన్నారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాగా, ఏపీలో పోలింగ్, పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని.. అల్లర్లకు ఆస్కారం లేకుండా పోలీసుల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,985 సున్నిత ప్రాంతాలు గుర్తించారు. రాష్ట్రానికి 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను దించారు.. కౌంటింగ్‌కు 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇక, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించిన విషయం విదితమే.
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!