AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కీలకంగా మారింది.. ఉదయం 8 గంటల నుండే కౌంటింగ్ ప్రారంభం కానుంది.. అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. ఒక్కో రౌండ్ లో 500 ఓట్లను లెక్కించనున్నారు.. ఉద్యోగివేసిన పార్లమెంటు/అసెంబ్లీ ఓటు లెక్కింపు కోసం అధిక సమయం పట్టనుంది.. డిక్లరేషన్.. ఓటర్ సంతకం వుందా లేదా..? పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగి వివరాలు.. ఇలా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేస్తారు.. అప్పుడు దానిని వాలిడ్ ఓటుగా పరిగణిస్తారు.. ఈ సారి దాదాపు 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి.. దీంతో కౌంటింగ్ కి అధికసమయం పట్టనుందని అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి EVM ల లెక్కింపు దాదాపు 3వ రౌండ్ ముగిసే అవకాశం ఉందంటున్నారు ఈసీ అధికారులు.
Read Also: INDIA bloc: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ..
పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ / EVM ఓట్లు లెక్కింపు 8.00 గంటలకే ప్రారంభం అవుతుంది.. అయితే, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తారు.. రౌండ్ వైజ్ ఫలితాలు అంటే విత్ ఔట్ (with out postal Ballet) పోస్టల్ బ్యాలెట్ లెక్క గా పరిగణించాలి.. కానీ, పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఆలస్యం అవుతుందంటున్నారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తర్వాతనే EVM కౌంటింగ్ జరిగేది.. ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఆలస్యమవుతుందంటున్నాయి ఎన్నికల సంఘం వర్గాలు.