Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్గా మారిపోయారంటూ […]
Andhra Girl Jailed in Hyderabad: హైదరాబాద్ పోలీసులు మోపిన కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ యువతి వాపోతోంది.. కానీ, పట్టించుకునే దిక్కు లేక జైలు జీవితం గడుపుతోంది. FIRలు నమోదైన సమయంలో తాను రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు బంధువులు ఆధారాలు సేకరించడంతో, ఆమెను విడిపించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రుకు చెందిన 19 ఏళ్ల రాజీ అనే యువతి గత మూడు వారాలుగా […]
YS Jagan: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు చేసి.. కోటి సంతకాల సేకరణ చేపట్టింది.. ఇక, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి […]
Bhavani Diksha Viramana: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్షా విరమణలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసులు, వివిధ శాఖలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మొత్తం మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. భవానీలు 41 రోజులపాటు అనుసరించిన నియమ నిష్టలకు ముగింపు పలకబోతుండటంతో వేలాదిగా భక్తులు తిరిగి ఇంద్రకీలాద్రి […]
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ అజెండా అంశాలు.. * రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర […]
కడప మాజీ మేయర్ సురేష్ బాబుకి హైకోర్టు షాక్ కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది.. మాజీ మేయర్ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేయర్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 4న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ […]
Botsa Satyanarayana: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైద్య విద్యను ప్రయివేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.. వైద్యాన్ని ప్రయివేటు పరం చేయొద్దు అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ఉద్యమం చేపట్టినట్టు బొత్స తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు […]
Tirumala Parakamani Case: సంచలనంగా మారిన తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, సంబంధిత విభాగాలకు అనుసరించాల్సిన సూచనలను కూడా కోర్టు స్పష్టంగా తెలియజేసింది. చోరీ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు పూర్తి వెసులుబాటు కల్పించింది.. కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. Read […]
Buggana Rajendranath: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పులపై మరోసారి కూటమి ప్రభుత్వం.. గత వైసీపీ ప్రభుత్వ నేతలపై మాటల యుద్ధం నడుస్తోంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల చంద్రబాబు విడుదల చేసిన స్థూల ఉత్పత్తి లెక్కలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎప్పటిలాగే పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు చెబుతున్నారు. ప్రజలు ఇవి నమ్మరు అని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన […]