Deputy CM Pawan Kalyan: ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. […]
Off The Record: గాల్లో ఎగరాల్సిన ఇండిగో విమానం…ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి…చివరకు ఏపీ మంత్రి లోకేష్ గాలి తీసేసే వరకు వచ్చిందా అంటే… ఎస్ అన్నదే ఈ పరిణామాలను గమనిస్తున్నవారి సమాధానం. తన ప్రమేయం లేకుండానే ఈ ఎపిసోడ్‌లోకి లాగి… అనవసరంగా ట్రోల్ చేయిస్తున్న పార్టీ నాయకుల్ని చూసి చివరికి లోకేష్ కూడా…. అరె ఎవుర్రా మీరంతా… అన్న సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారట. టీడీపీ అభిమానులు కూడా… ఎక్కడ తయారయ్యార్రా వీళ్ళంతా….. అనవసరమైన ఇష్యూలోకి ఆయన్ని లాగి […]
Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ, ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా హోటల్ మరియు టూరిజం రంగాల […]
Off The Record: 2024 ఎన్నికల ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న వైసీపీ అధినేత జగన్…. అప్పుడు దూరమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకునే పనిలో సీరియస్‌గా ఉన్నారు. వన్ బై వన్ హర్డిల్స్‌ను దాటుకుంటూ వస్తున్న క్రమంలో… ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా…. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తుండటం అందులో భాగమేనని అంటున్నారు పరిశీలకులు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయిస్ కోసం ఏమేం చేశామో గుర్తు […]
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే..! ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, పెద్ద ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రూ.169 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడానికి కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఇది రాష్ట్ర […]
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్‌గా మారిపోయారంటూ […]
Andhra Girl Jailed in Hyderabad: హైదరాబాద్ పోలీసులు మోపిన కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ యువతి వాపోతోంది.. కానీ, పట్టించుకునే దిక్కు లేక జైలు జీవితం గడుపుతోంది. FIRలు నమోదైన సమయంలో తాను రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు బంధువులు ఆధారాలు సేకరించడంతో, ఆమెను విడిపించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రుకు చెందిన 19 ఏళ్ల రాజీ అనే యువతి గత మూడు వారాలుగా […]
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు చేసి.. కోటి సంతకాల సేకరణ చేపట్టింది.. ఇక, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి […]
Bhavani Diksha Viramana: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్షా విరమణలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసులు, వివిధ శాఖలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మొత్తం మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. భవానీలు 41 రోజులపాటు అనుసరించిన నియమ నిష్టలకు ముగింపు పలకబోతుండటంతో వేలాదిగా భక్తులు తిరిగి ఇంద్రకీలాద్రి […]