గృహ నిర్మాణం పేరిట కేంద్ర నిధులు దుర్వినియోగమయ్యాయా.. అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అధికారంలోకి రావడంతో.. హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫోకస్…
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు.
అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.. బాలికకు అండగా ఉంటానని ప్రకటించారు..
గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్ అయ్యారు.
అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఇదే సమయంలో.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం అన్నారు.. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను.. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను అన్నారు..