RK Roja: తప్పు చేయాలంటేనే భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..!
- వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారు..
- ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదంటున్న మాజీ మంత్రి రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: గతంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సినీనటి రవళితో కలిసి ఈ రోజు శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన రోజా.. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.. గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తప్పు చేయాలంటే ఎవరైనా భయపడే వారని.. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ నుంచి వరుసగా ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయిస్తూ ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయిస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రజలలో గౌరవం దక్కదని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.
Read Also: Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?